రాజ్ గ్రేట్ జర్నీ.. విన్ ఎందుకు కాలేదంటే!
on Nov 28, 2022
బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని వారాలు ఉండటమే గ్రేట్.. అలాంటిది హౌస్ లో చివరి పది మంది లో ఒకడిగా ఉన్నాడు రాజ్. అతనిది గ్రేట్ జర్నీ. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి కోట్ల మంది ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు.
అయితే బిగ్ బాస్ హౌస్ లో రిజర్వ్ గా ఉంటే కొన్నివారాలు మాత్రమే ఉండొచ్చు. కానీ హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్క కంటెస్టెంట్ బెస్ట్ పర్ఫామర్ అని ఒక్కసారైనా అనిపించుకోవాలి. అలా కాకుండా ఎవరితోను సరిగ్గా ఉండకుండా, గుంపులో గోవిందలాగా ఉంటే ప్రేక్షకులు ఓట్లు వేయరని మరోసారి ఋజువు అయ్యింది. అయితే రాజ్ హౌస్ లో అందరితో సరదాగానే ఉంటాడు. కానీ అది ప్రేక్షకులకు బిగ్ బాస్ చూపించకపోవడం కూడా రాజ్ కి ఒక మైనస్ అనే చెప్పాలి.
రాజ్ ఈజీగా మానిపులేట్ అవుతాడు. తన మీద తనకి నమ్మకం చాలా లేట్ గా రావడం. చివర్లో కాస్త సేఫ్ గేమ్ ఆడటం. రేవంత్, శ్రీహాన్ లతో సేఫ్ గా ఉన్నట్లు అనిపించాడు. చివర్లో రియలైజ్ అయ్యినా, లాభం లేకుండా పోయింది. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్లో శ్రీహాన్ "రాజ్.. నువ్వు ఏదైతే మాట్లాడతావో దాన్ని కాన్ఫిడెంట్ గా మాట్లాడు. అటు ఇటు దిక్కులు చూసుకుంటూ మాట్లాడితే నువ్వు కాన్ఫిడెంట్ గా లేవనే ఇంప్రెషన్ ఎవరికైనా వచ్చేస్తుంది. సో నువ్వు మాట్లాడేది ఏదైనా ధైర్యంగా మాట్లాడు" అని రాజ్ తో చెప్పాడు. ఆ తర్వాత హౌస్ నుండి స్టేజ్ మీదకి వచ్చిన రాజ్ తో "రాజు ఎక్కడున్నా రాజే. చాలా చేంజ్ అయ్యావ్ రాజ్" అంటూ నాగార్జున కాసేపు మాట్లాడాడు.
Also Read